calender_icon.png 21 September, 2025 | 1:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోపిరెడ్డి నగర్ లో ఎంగిలి పువ్వు బతుకమ్మ ఆట.. పాటకు సర్వం సిద్ధం

21-09-2025 11:15:13 AM

కోదాడ: కోదాడ పట్టణంలోని గోపిరెడ్డి నగర్ లో మహిళలకు  అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ ఆటపాట. కాగా  ఆదివారం నుండి ప్రారంభమయ్యే ఎంగిలిపువ్వు బతుకమ్మ  ఆటపాటకు మైదానం సిద్ధం చేశారు. బతుకమ్మ పండుగ లో భాగంగా తొలి రోజు ఉదయం తులసి వెంపలి  చెట్లకు స్థానిక మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాంప్రదాయపరంగా  తొలి రోజు ఈ ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాగా గోపిరెడ్డి నగర్ లో ఇంటింటా  బతుకమ్మ పండుగ సందడి నెలకొన్నది. పాఠశాలలకు సెలవులు రావడం బంధువులు మిత్రులతో ఇళ్లలో సందడిగా ఉంది. స్థానిక పెద్దలు బతుకమ్మ పండుగ ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ కార్య క్రమంలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.