2 September, 2026 | 8:36 AM

‘కాంగ్రెస్‌లో సేవాదళ్‌కు ఘనమైన చరిత్ర‘

01-09-2025 | 12:35am

రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యం

యాదాద్రి భువనగిరి ఆగస్టు 31 ( విజయక్రాంతి ) : కాంగ్రెస్ పార్టీలో సేవాదళ్ విభాగానికి ఘనమైన చరిత్ర ఉందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంతవరకు సేవాదళ్ నిరంతరం పోరాడుతుందని భువనగిరి మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ అన్నారు. ఆలీండియా సేవాదళ్ అధ్యక్షులు లాల్చీ దేశాయ్ , రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆదేశానుసారం సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సామల రవీందర్ అధ్వర్యంలో ఆగష్టు మాసం చివరి ఆదివారం నాడు పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా  పార్టీ జెండాను ఎగురవేశారు. రాబోయే రోజుల్లో ప్రతి వాడలో జెండా ఆవిష్కరణలు కావిస్తూ,హర్ గావ్,హర్ గల్లీ నినాదంతో సేవాదళ్ ముందుకెళుతుందని అన్నారు. అదే స్పూర్తితో భారత స్వాతంత్రం కోసం బ్రిటిష్ పై పోరాటం చేసి దేశం కోసం ప్రాణాలర్పించిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశ సమగ్రత ఐక్యతను కాపాడడానికి ప్రాణాలు అర్పించారన్నారు. 

రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమే  సేవాదళ్ లక్షమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  పథకాలన్నింటిని ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేసి రానున్న స్థానిక ఎన్నికల్లో ఓట్ల అడిగి కాంగ్రెస్ జెండాను గెలిపించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి పిట్టల బాలరాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సామల రవీందర్, టౌన్ సేవాదాళ్ అధ్యక్షులు ఠాకూర్ ప్రకాష్, మండల బ్లాక్ సేవల అధ్యక్షులు బత్తిని జితేందర, మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కవిత, ఉడుత రమేష్, గోపే శివ, చేగూరి అమరేందర్, సిరిపంగ ప్రశాంత్, కానుగుంట్ల శశి, సాయి, కార్తీక్ , ఉమాకాంత్ పాల్గొన్నారు.