ఉద్యోగి అంకితభావంతో గుర్తింపు
01-09-2025 | 12:34am
నిర్మల్, ఆగస్టు 31 (విజయక్రాంతి): ఏ ఉద్యోగి అయినా అంకితభావంతో పనిచేస్తే ఆ ఉద్యోగి పదవి విరమణ పొందిన ప్రజల మెప్పు ఎన్నటికీ మరువలేరని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. ఆదివారం నిర్మల్ సిడిపిఓగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేస్తున్న నాగమణి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
43 ఏళ్లు ఆమె అంకితభవంతో పనిచేసి ప్రజలకు అన్ని రకాల సేవలను అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఓ విజయలక్ష్మి టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ అంగన్వాడి సిబ్బంది ఉద్యోగులు పాల్గొన్నారు.






