2 September, 2026 | 7:40 AM

మోదీని విమర్శిస్తే సహించేది లేదు

01-09-2025 | 12:36am

-బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం

కుమ్రం భీం ఆసిఫాబాద్/ఆదిలాబాద్, ఆగస్టు 31 (విజయ క్రాంతి): దేశ రక్షణ కోసం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తే సహించేది లేదని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ యాదవ్ అన్నారు.

రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ తల్లిని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలకు నిరసనగా ఆదివా రం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద రహదారిపై రాహుల్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మోదీని ఎదుర్కోలేక రాహుల్ అనిచిత వ్యాఖ్యలు చేస్తూ దిగజారిపోతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కోట్నాక విజయ్ , పెంటన్న , విజయ్, ప్రహ్లాద్, కొలిపాక కిరణ్, కోటేష్, లచ్చన్న, జయరాజ్ ,వీరభద్ర చారి, మురళి గౌడ్ ,వినోద్, మధుకర్, రాములు ,శంకర్, బిజ్జు, రేణుక, రేవతి, స్వరూప పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌లో రాహుల్ దిష్టిబొమ్మ దహనం.. స్వల్ప ఉధృక్తత

ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ శ్రేణులు ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన తెలిపారు. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లో నిరసన చేపట్టారు. బీజేపీ శ్రేణులు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు