31 March, 2026 | 2:06 PM

Breaking News

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •  

రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు

07-12-2024 03:09 AM

ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 28 జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయగా అందులో తెలంగాణకు 7 కేటాయించింది. అందులో మహబూబ్‌నగర్, సంగారెడ్డి, జగిత్యాల, నిజామాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9 నవోదయ విద్యాలయాలుండగా వీటితో కలిపి 16కు చేరుకోనున్నాయి.

అయితే జేఎన్వీలను ప్రారంభించనప్పుడు కేంద్రం జిల్లాకు ఒక్కటి చొప్పున తీసుకురాగా.. జిల్లాల సంఖ్య పెరగడంతో ఆ స్థాయిలో కొత్త విద్యాలయాలను మంజూరు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రానికి నవోదయ విద్యాలయాలను మంజూరు చేసినందుకు ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణ కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెలబెట్టుకున్నామని, వెనుకబడిన పాలమూరు జిల్లాకు నవోదయ ద్వారా మెరుగైన విద్య లభించనుందన్నారు. కాగా నవోదయ విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో 6 నుంచి 12వ తరగతి వరకు గురుకుల విధానంలో ఉచిత విద్యను అందిస్తారు.