యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
పేదోడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయం
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): పేదోడికి కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ ద్యేయమని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట పట్టణం,మండల పరిధిలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. యాదగిరిగుట్ట పట్టణంలోని బస్ స్టాండ్, పాతగుట్ట రోడ్డులో వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చలివేంద్రాన్ని ప్రారంభించారు. పట్టణంలోని 2వ వార్డు, 3వ వార్డుల్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. రహదారి సౌకర్యాలు మెరుగుపడటం వల్ల ప్రజల రాకపోకలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. రైతులకు మద్దతు ధర కల్పించే లక్ష్యంతో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ
యాదగిరిగుట్టలో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావడం కోసం 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేశారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రి ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. దీనిని సంవత్సరంలో పూర్తిగా నిర్మాణం చేసుకొని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. పట్టణంలో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి సేవలను స్మరించుకున్నారు.
పట్టణంలో నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు పట్టు బట్టలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ రమ్య రామచంద్రర్,కౌన్సిలర్లు బబ్బూరి శ్రీధర్ గౌడ్, ముక్యర్ల మల్లేష్ యాదవ్, పేరబోయిన సత్యనారాయణ, బూడిద మధు, బొడ రాధ, సాదినేని ధనలక్ష్మి, కాటబత్తిని స్వప్న, కర్రే మాధవి, పెళ్లిమెల్లి లావణ్య, బిట్టు సరోజ, దాతర్ పల్లి సర్పంచ్ కాల్నే సరిత భాస్కర్, వార్డు సభ్యులు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






