20 April, 2026 | 9:51 PM

Breaking News

సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం   •   పౌష్టికాహారం తీసుకునేలా ప్రోత్సహించాలి   •   టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలి   •   డీలిమిటేషన్ బిల్లు వెనుక రాజ్యాంగాన్ని మార్చే కుట్ర   •   యాదగిరిగుట్టలో పలు అభివృద్ధి కార్యక్రమాలు   •   చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు   •   ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   పెళ్లిరోజు... మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ   •   రైతుకు మద్దతు ధర కల్పించడమే ప్రధాన లక్ష్యం   •   ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచొద్దు   •  

చలో జగిత్యాల.. కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పీర్జాదిగూడ బీఆర్ఎస్ శ్రేణులు

20-04-2026 08:48 PM

కేసీఆర్ నాయకత్వంలో తిరిగి బంగారు తెలంగాణ సాధిద్దాం

 మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

మేడిపల్లి,(విజయక్రాంతి): అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, కేవలం రెండున్నరేళ్లలోనే తెలంగాణ తిరిగి వెనక్కి వెళుతోందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం మన తెలంగాణను కాపాడుకోవాలంటే కేసీఆర్ నాయకత్వమే మార్గమని పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్రకు శ్రీకారం అనే నినాదంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో, కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లు దొంతిరి హరిశంకర్ రెడ్డి, కొల్తూరి మహేష్, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు మనోరంజన్ రెడ్డి, ఆకుల మధుకర్, యాసారం శ్రీనివాస్, మునికింట్ల కిరణ్ గౌడ్, గడీల జగన్ రెడ్డి, పింగళి జోగిరెడ్డి బుల్లెట్ శంకర్, మల్లం వెంకటేష్ గౌడ్, మహేందర్ రెడ్డి, నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, కిరణ్ నాయక్,సురేష్,వెంకటయ్య, రాము, చక్రి, విక్కీ,  రాకేష్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.