11 July, 2026 | 12:19 PM

సురేందర్ రెడ్డి మృతి పై పలువురు నాయకుల సంతాపం

11-07-2026 11:31 AM

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి మాజీ సర్పంచ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు .పాటి సురేందర్ రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై మృతి చెందాడు. దీనితో పార్ధీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య వారి వెంట మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శి నవీన్ చారి, వెలుగుబల్లి కాంగ్రెస్ నాయకులు, బంధువులు, తదితరులు పాల్గొన్నారు.