కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు
11-07-2026 11:30 AM
బెజ్జూర్ జులై 11 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు జాడి దిగంబర్, వార్డ్ సభ్యులు సామల తిరుపతి, తంగేడి పల్లి నీలేష్, బెనికి శ్యాంసుందర్, రమేష్, నీలి మహేష్, ప్రవీణ్, కిరణ్, ఏబీవీపీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






