ఐకేపీ సెంటర్లను తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం
సూర్యాపేట, అక్టోబర్ 17 (విజయక్రాంతి) : రైతుల కోసం ఐకెపి సెంటర్లను 2004లో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 18వ వార్డు బలరాం తండలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వరి ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ కు తీసుకువచ్చేటప్పుడు ఆరబెట్టుకొని, తేమ శాతం లేకుండా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఐకెపి సెంటర్లలో ధాన్యం వర్షాలకు తడవకుండా టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, దండు మైసమ్మ ఆలయ చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, చింతమల రమేష్,వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధరావత్ నాగు నాయక్,మాజీ కౌన్సిలర్ మాలోతు కమల చంద్రు నాయక్, డిఎంసి వసంత్ కుమార్ టిఎంసి శ్వేత, సి ఓ సువర్ణ, ఐకెపి అధ్యక్షురాలు సక్కుబాయి, కవిత, ట్యాబ్ ఆపరేటర్ రంజిత్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.






