19-01-2026 03:51:08 PM
బెల్లంపల్లి(విజయక్రాంతి): పట్టణంలోని 34 వార్డులలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి మాట్లాడుతూ... 34 వార్డులలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. ప్రధానంగా మంచినీటి తీవ్రంగా ఉందన్నారు. 34 వార్డులకి గంగా వాటర్ రాక కొన్ని సంవత్సరాలు గడిచినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పడిస్తున్న అడా ప్రాజెక్టు వాటర్ కూడా 15, 20 రోజులకు ఒకసారి వస్తున్నాయనీ తెలిపారు. వెంటనే వాటర్ సమస్యను పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు.
పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉందని విమర్శించారు. వార్డుల్లోకి చెత్త బండ్లురాక అనేక వార్డులలో చెత్తలు ముప్పుగా పేరుకుపోయిందని తెలిపారు. 18వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం కోసం తవ్వి రెండు సంవత్సరాలు పూర్తయిన కూడా ఇప్పటివరకు పట్టించుకోలేదునీ ఆరోపించారు. ఇలా రోడ్లు సరిగా లేకపోవడం వలన అత్యవసర సమయంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగిందనీ తెలిపారు. పట్టణంలో వీధుల్లో కుక్కలు, పందులు, కోతుల బెడద పెరిగిపోయిoదన్నారు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారనీ వాపోయారు.
వెంటనే మున్సిపాలిటీలో నెలకొన్న ప్రతి సమస్యను పరిష్కరించాలనీ డిమాండ్ చేశారు. అంతరం మునిసిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దూది ప్రకాష్, జిల్లాఎస్సీ మోర్చా కార్యదర్శి కల్లపల్లి నవీన్ పట్టణ ఉపాధ్యక్షులు బాసబోయిన యుగేందర్, అలకాటి మహేష్ ఎర్రోజ శ్రీనివాస్ షేక్ గౌస్ బాబా, గర్రెపల్లి రాకేష్ బాబు, రామన్న, సత్తన్న, విజయ లక్ష్మి ,బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల కో కన్వీనర్ జిల్లా కార్యదర్శి రాచర్ల సంతోష్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ పాల్గొన్నారు.