2 March, 2026 | 2:56 AM

నల్లాల్లో మురుగునీరు

02-03-2026 01:13 AM
  1. నగరవాసుల ప్రాణాలతో జలమండలి చెలగాటం
  2. బాగ్‌లింగంపల్లి, ఎస్‌వీకే పరిసరాల్లో కలుషిత నీటి సరఫరా

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి1 (విజయక్రాంతి): భాగ్యనగరంలోని పలు ప్రాంతా ల్లో తాగునీరు విషతుల్యంగా మారుతోంది. నల్లా నీటిలో మురుగు నీరు కలిసి వస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా బాగ్ లింగంపల్లి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం నైబర్ హుడ్ కాలనీ వంటి ప్రాం తాల్లో కొన్ని రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీటి పైపులైన్లలో డ్రెయినేజీ నీరు కలవడమే దీనికి కారణమని తెలుస్తోంది. సాధారణంగా తా గునీరు సరఫరా కావాల్సిన సమయంలో నల్లాల నుంచి నల్లటి రంగులో, దుర్వాసనతో కూడిన మురుగు నీరు వస్తోందని బాగ్ లిం గంపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటకు, తాగడానికి గత్యంతరం లేక బయట వాటర్ క్యాన్లు కొనుక్కుంటున్నామన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది భారంగా మారుతోందంటున్నారు.

కలుషిత నీటి సరఫరా వల్ల కలరా, టైఫాయిడ్ వంటి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికులు వణికిపోతు న్నారు. ఇప్పటికే పలువురు చిన్నారులు, వృద్ధులు అస్వస్థతకు గుర వుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. నల్లా ల్లో మురుగు నీరు వస్తోందని, దీనిపై జలమండలి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు మండిపడుతున్నారు.

పైపులైన్లు పాతబడిపోవడం, భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో తాగునీటిలో మురుగు నీరు కలు స్తోందని, జలమండలి వెంటనే స్పం దించి స మస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. లేకుంటే కార్యాలయం ముందు ధర్నా చేస్తామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.