16 April, 2026 | 11:25 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఉపాధ్యాయుల సంక్షేమమే తెలంగాణ పీఆర్టీయూ లక్ష్యం

02-03-2026 01:14 AM

పీఆర్టీయూ తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి 

కామారెడ్డి, మార్చ్ 1 (విజయక్రాంతి): ఉపాధ్యాయుల సంక్షేమమే పిఆర్టియు తెలంగాణ లక్ష్యమని పి ఆర్ టి యు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర, జిల్లా బాధ్యులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భాషా పండితులకు, పిఈటిలకు, ఎస్జీటీలకు, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించడంలో పిఆర్టియు తెలంగాణ కీలక పాత్ర పోషించినదన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడానికి ముందు ఉంటామని హామీ ఇచ్చారు.

సిపిఎస్ విధానం రద్దు పరిచి ఓ పి ఎస్ పునరుద్ధరించడం, 2003 డిఎస్సి వారికి జీవో 57/4,57/5 అమలు పరచాలన్నారు. ఉమ్మ డి సర్వీసు సాధించడం, ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో పదోన్నతులు బదిలీలు నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. కేజీబీవీ లో పనిచేస్తున్న పిజిసిఆర్టి లకు, సి ఆర్ టి లకు, ఎస్‌ఎస్సి లో పనికి చేస్తున్న అందరికీ మినిమం టైమ్ స్కేల్ ఇప్పించడం, హెల్త్ కార్డులు ఇప్పించడానికి కృషి చేస్తామన్నారు.

మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న గురుకులాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎయిడెడ్ స్కూల్స్ ని ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయడం, కామారెడ్డి జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం వారి హక్కుల సాధారణలో కామారెడ్డి జిల్లా శాఖ క్రిఎస్‌ఈ ల పాత్ర పోషిస్తుందన్నారు. పదవ తరగతి మూల్యాంకన కేంద్రం కామారెడ్డి జిల్లా కేటాయించడానికి పట్టుబట్టి సాధించారని జిల్లా అధ్యక్షులు అంబిర్ మనోహర్ రావు ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మి రాజ్యమును అభినందించారు.

రాష్ట్ర విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సారథ్యంలో విద్య కమిషన్ ఉపాధ్యాయులకు వేతనాలు తగ్గించాలని చెప్పడం అవివేకతనమని అన్నారు. విద్యకు కేటాయించే నిధులు ఖర్చు గా చూడకూడదని పెట్టుబడిగా చూడాలని అన్నారు. ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ పొందే విద్యార్థులు దేశానికి ఉత్తమ పౌరులుగా, ఎదుగుతారు అది పెట్టుబడికి ఫలితంగా మారుతుంది అని చెప్పారు.

ఈ సమావేశంలో పిఆర్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకర్ రావు, కార్యనిర్వాహక అధ్యక్షులు చంద్రశేఖర రావు, జిల్లా అధ్యక్షులు అంబిర్ మనోహర్రావు, ప్రధాన కార్యదర్శి జనాపాల లక్ష్మీ రాజం, గౌరవ అధ్యక్షులు ఓం ప్రకాష్, రాష్ట్ర, జిల్లా బాధ్యులు ఆనంద్, వెంకట్, మారుతి, తదితరులు పాల్గొన్నారు.