calender_icon.png 2 February, 2026 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై పొర్లుతున్న డ్రైనేజీ మురుగు

02-02-2026 12:00:00 AM

  1. నెలలు గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
  2. చర్యలు తీసుకోవాలంటూ సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు వనంపల్లి జైపాల్ రెడ్డి డిమాండ్

రాజేంద్రనగర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి) : కాటేదాన్ టిఎన్జీవోస్ కాలనీలో నెలల తరబడి డ్రైనేజీ మురుగనీరు రోడ్డుపై ఏరులై ప్రవహిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు విమర్శిస్తున్నారు. నిత్యం ప్రవహిస్తున్న ఈ మురుగు నీటిలో నుంచే రాకపోకలు సాగిస్తున్న ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. డ్రైనేజీ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరిం చాల్సిన అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నెలల తరబడి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుందంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టీఎన్జీవోస్ కాలనీ అమ్మ గార్డెన్ నుంచి కాటేదాన్ రేషన్ షాపు రావడానికి ప్రధాన రహదారి ఇదే కావడంతో ప్రతిరోజు వేలాదిమంది కార్మికులు, విద్యార్థులు ఈ ఈ దుర్గంధపు రోడ్డు లోనే వెళ్లా ల్సిన దుస్థితి నెలకొందనే ఆరోపణలున్నా యి.

కొన్ని నెలల నుంచి డ్రైనేజీ మురుగు నిత్యం రోడ్డుపై పొంగీ ప్రవహిస్తున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే లేదా కార్పొరేటర్ కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సిపిఐ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు వనంపల్లి జైపాల్‌రెడ్డి విమర్శించారు.