02-02-2026 12:00:00 AM
డ్రైనేజీల్లో చెత్తాచెదారం పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు
తరిగొప్పుల, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని వివిధ గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో పరిసరాల పరిశుభ్రత తోనే సీజనల్ వ్యాధులను అరికట్టవచ్చని అధికారులు పలుమార్లు చెబుతున్నా పట్టించుకునే వారే కరువై గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. గ్రామాల్లో పాలకవర్గం ఉన్నా కూ డా పారిశుద్ధ్యం పై అధికారులకు పట్టింపు లేకుండా పోయిందనే ఆరోపణలు గ్రామాలలో వినిపిస్తున్నాయి.
డ్రైనేజీల్లో చెత్తాచెదారం
తరిగొప్పుల మండలంలో 15 గ్రామ పం చాయతీలు ఉన్నాయి. మోజార్టీ గ్రామాల్లోని డ్రైనేజీల్లో చెత్తాచెదారం పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో గ్రామాల్లో రోడ్లను, డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో చెత్తతో డ్రైనేజీలు పూడికపోయాయి. గ్రామాల్లో ప్రజలు ఇంటి అవసరాలకు వాడుకున్న నీరు డ్రైనేజీల్లో సాఫీగా వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఈగలు, దోమలు వృద్ధి చెందుతున్నాయి. గ్రామాల్లోని పరిశుభ్రత చర్యలు పై స్థానిక అధికారులు దృష్టిసారించకపోవడం తో పరిశుద్యం అస్తవ్యవస్తగా మారింది.
పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు
సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే గ్రామాలను పరిశుభ్రతగా ఉంచుకో వాలని జిల్లా అధికారులు, వైద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో ము రుగు నీరు గుంతల్లో నిల్వ ఉండకుండా రోడ్ల వెంట చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉం చుకోవాలని చెబుతున్నా గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మా రింది. వెంటనే స్పందించి డ్రైనేజీ కాల్వలను శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.