13 August, 2026 | 7:14 PM

బోధన్ పట్టణంలో రోడ్డుపై మురుగు నీరు.. ప్రజలకు ఇబ్బందులు

13-08-2026 05:26 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ ఆర్డీవో, తహశీల్దార్, మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు నిలిచి బురద పేరుకుపోయింది. సమీపంలో పాఠశాల ఉండటంతో విద్యార్థులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటితో దుర్వాసన వస్తుండటంతోపాటు దోమలు పెరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. సమస్య ఏర్పడి కొన్ని రోజులు గడుస్తున్నా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.