calender_icon.png 15 January, 2026 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

15-01-2026 03:26:02 AM

నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఆలేరు, జనవరి 14 (విజయక్రాంతి) : నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన 60 ఏళ్ల వ్యక్తిని భువనగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం పెంచికల్ పహడ్ గ్రామానికి చెం దిన సిలివేరు ఎల్లయ్య ఇంటి పక్కన నాలుగు సంవత్సరాల పాపకు మాయ మాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పాప ఏడ్చుకుంటూ వచ్చి జరిగిన విషయాన్ని తన నానమ్మకు చెప్పడంతో ఆమె భువనగిరి రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది.

పాపకు మెరుగైన చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులో తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నట్లు భువనగిరి రూరల్ ఎస్ హెచ్ ఓ అనిల్ కుమార్ తెలిపారు. కాగా చిన్నారిపై అఘాయి త్యానికి పాల్పడిన ఎల్లయ్యను ఉరితీయాలంటూ భువనగిరి ప్రిన్స్ చౌరస్తా వద్ద బుధవారం గ్రామస్తులు, బంధువులు రాస్తారోకో చేశారు.