calender_icon.png 26 December, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువకుడి ప్రాణం తీసిన ఆన్‌లైన్ బెట్టింగ్

26-12-2025 02:53:42 AM

  1. యాప్‌లో లక్ష నష్టపోయి.. మనస్తాపంతో ఆత్మహత్య 
  2. రంగారెడ్డి జిల్లాలో ఘటన

కందుకూరు, డిసెంబర్ 25 (విజయక్రాంతి): బెట్టింగ్ యాప్‌లో రూ.లక్ష నష్టపోవడంతో ఇంట్లో వారు మందలిస్తారనే భయంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధి దెబ్బడగూడలో జరిగింది. దెబ్బడగూడ గ్రామానికి చెందిన వాస్పూరి విక్రమ్ (20) నారాయణగూడలోని బీజేఆర్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. విక్రమ్ ఇంటి నుంచి రూ.లక్ష తీసుకుని ఫన్ ఇన్ ఎక్స్చేంజ్ అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడి పెట్టి, నష్టపోయాడు.

ఈ విషయమై తల్లిదండ్రులు మందలిస్తారన్న భయంతో ఈ నెల 22న పొలానికి వెళ్లాడు. తమ్ముడు ఇంటికి రాకపోవడంతో అన్న శ్రీకాంత్ వెళ్లి చూడగా అచేతన స్థితిలో ఉన్నాడు. చికిత్స నిమిత్తం తొలుత ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విష మించి గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామ ని సీఐ సీతారాం తెలిపారు.