2 June, 2026 | 2:43 AM

అంపైర్‌పై లింగవివక్ష వ్యాఖ్యలు

02-06-2026 01:37 AM

యువ ఆటగాడికి భారీ జరిమానా

పారిస్, జూన్ 1 : ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళా అంపైర్‌ను దూషించిన యువ ఆటగాడికి నిర్వాహకులు షాకిచ్చారు. పెరుగ్వేకు చెందిన అడాల్ఫో వల్లెజో తన మ్యాచ్‌కు మహిళా ఛైర్ అంపైర్ బదులు పురుషుడిని నియమించి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. చైర్ అంపైర్‌గా ఉన్న అనా కర్వాల్హోపై అతను ఈ వ్యాఖ్యవు చేశా డు. మహిళా అంపైర్ కాకుండా మగ అం పైర్ అయితే ప్రేక్షకుల అరుపులను, అల్లరిని అదుపు చేసేవాడంటూ పేర్కొన్నాడు. 

రెండో రౌండ్‌లో ఓడిపోయిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా ఇలా వ్యాఖ్యానించడంతో నిర్వాహకులు చర్యలు తీసుకు న్నారు. చైర్ అంపైర్‌ను అవమానించేలా, లింగ వివక్షపూరితంగా మాట్లాడడంతో రూ.71 లక్షల జరిమానా విధించారు. తన వ్యాఖ్యలపై అతను క్షమాపణ చెప్పినా జరిమానా కట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఓటమి బా ధలో తాను అలా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కా మెంట్స్ చేయలేదని, తప్పయితే క్షమించాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.