థాంక్యూ వైభవ్
* ఎవడ్రా బుడ్డోడు బుడ్డోడు అంటోంది... ఆ కుర్రాడు బుడ్డోడు కాదు ప్రత్యర్థి బౌలర్ల పాలిట బుల్డోజర్... వరల్డ్ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్లకు చుక్కలు చూపించిన మొనగాడు... 15 ఏళ్లకే కమిన్స్ , స్టార్క్ , బుమ్రా , షమీ, రబాడ వంటి స్టార్ పేసర్లను ఉతికారేసిన బేబీ బాస్... అసలు ప్రత్యర్థి జట్లలో చాలా మంది బౌలర్లను నిద్రలో కూడా వెంటాడిన బ్యాటర్ అతడే.. ఈ విషయాన్ని కొందరు పైకి చెప్పకున్నా అది మాత్రం వాస్తవం... సీజన్ మొత్తం పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్‌తో పలు అవార్డులు సొంతం చేసుకున్నాడు. కప్ గెలిచింది ఆర్‌సీబీనే అయినా ఫ్యాన్స్‌ను అలరించి హీరో ఆఫ్ ది సీజన్‌గా నిలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశీనే.
- హీరో ఆఫ్ ది సీజన్‌గా చిచ్చర పిడుగు
- బుడ్డోడి ఆటకు దిగ్గజాలు ఫిదా
- రెండో సీజన్‌తోనే సూపర్ స్టార్
- త్వరలో టీమిండియా ఎంట్రీ
ముంబై, జూన్ 1 : ఒకప్పుడు భారత క్రికెట్ జట్టు లో సచిన్‌ను ఔట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు ప్రణాళికలు సిద్ధం చేసుకునేవారు. మళ్లీ ఇన్నాళ్లకు అది కూడా a 15 ఏళ్ల కుర్రాడిని ఔట్ చేసేందుకు కిందా మీదా పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు మూడేసి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారంటే వైభవ్ ఏ రేంజ్‌లో ప్రత్యర్థి జట్లను భయపెట్టాడో అర్థమవుతోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ఇన్నింగ్స్ అతని విధ్వంసానికి ఉదాహరణ.
ఇంకా చెప్పాలంటే రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్‌లో వైభవ్‌ను ఔట్ చేస్తే మ్యాచ్ గెలిచినట్టే.. ఒకవేళ ఔట్ చేయకుంటే మాత్రం అతని ఊచకోతకు బలవ్వాల్సిందే.. ప్రత్యర్థి బౌలర్ ఎవరన్న ది అనవసరం.. కొడితే సిక్సర్.. లేకుం టే బౌండరీ.. ఇలా సాగింది వైభవ్ విధ్వంసం.. సీజన్ ఆ ద్యంతం పరుగుల వరద పారించాడు. అది కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో తన మీద అంచనాలను మరింత పెంచుకున్నాడు. కొన్ని మ్యాచ్‌లలో వైభవ్ ఆడిన షాట్లు అబ్బురపరిచాయి.
టీ20 క్రికెట్ లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించిన క్రిస్ గేల్, రస్సె ల్ వంటి హిట్టర్స్ సైతం వైభవ్ బ్యా టింగ్‌కు ఫిదా అ యిపోయారు. అటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, అని ల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ సైతం బుడ్డోడి ఆటకు ముగ్ధులయ్యారు. అతని రిస్ట్ ప్లే అద్భుతమంటూ సచిన్ కితాబిచ్చాడు. ఇక ఫైనల్ మ్యాచ్ ముగిసిన త ర్వాత కోహ్లీ సై తం వైభవ్‌తో ప్రత్యేకంగా మాట్లాడాడు. గత ఏడాది అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ సెంచరీతో తన స్టామినా ఏంటనేది వరల్డ్ క్రికెట్‌కు చెప్పేశాడు.
ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకో వాలి. క్వాలిఫైయర్ 2లో పరిణితి చెందిన బ్యాటర్‌గా ఇన్నింగ్స్ ఆడాడు. పవర్ ప్లేలోనే 2 వికెట్లు పడి ఒత్తిడి నెలకొన్న వేళ తాను కూడా ఇష్టానుసారం హిట్టింగ్ కు పోకుండా ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఈ సీజన్ లో వైభవ్ 16 మ్యాచ లలో 776 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్‌లో ఐదు అవార్డులు సొంతం చేసుకున్న వైభవ్ త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమని చెబుతున్నారు.
అయితే ఇక్కడ నుంచి ఈ చిచ్చరపిడుగును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐపై నే ఉంది. చాలా మంది డిమాండ్ చేస్తున్నట్టు హడావుడిగా ఎంపిక చేయడం కంటే సరైన రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధం చేసి బరిలోకి దించాలని పలువురు సూచిస్తున్నారు. మొత్తం మీద ఐపీఎల్ 2026 సీజన్‌లో తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో అలరించిన బుడ్డోడికి అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు.






