పేద ప్రజలకు అండగా షబ్బీర్ అలీ
24-03-2026 09:17 PM
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానీపేట గ్రామానికి చెందిన నర్సాగౌడ్ కుమారుడు అరవింద్ గౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేయవలసిందని చెప్పగానే వాళ్ళ ఆర్ధిక ఇబ్బందులు ఉన్నందున కాంగ్రెస్ నాయకులను సంప్రదించగ వెంటనే మన ప్రియతమా నాయకుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి విషయం చెప్పడంతో షబ్బీర్ అలీ వెంటనే స్పందించి నిమ్స్ హాస్పిటల్ డాక్టర్ తో మాట్లాడి నర్సాగౌడ్ కుమారుడు అరవింద్ గౌడ్ కి ప్రభుత్వ తరపు నుండి చికిత్స నిమిత్తం 2,50,000/- రూపాయలు ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కి అరవింద్ గౌడ్ కుటుంబసభ్యులు కృతఙ్ఞతలు తెలియజేసారు.




