జూ పార్కును సందర్శించిన షబ్బీర్ అలీ
చార్మినార్, మే 25 : నెహ్రూ జూలాజికల్ పార్కును మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఆయన కుటుంబ సభ్యుల తో కలిసి శనివారం సందర్శించారు. జూ పార్కులో సఫారీ పార్కు కాంప్లెక్స్, సరీసృపాల గృహం, రాత్రిపూట జంతువులు ఉండే గృహం, పెద్ద పిల్లల ఎన్‌క్లోజర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. జూపార్కులోని వన్య ప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం టుందన్నారు.
పర్యాటకులు జూ పార్కులో పరిశుభ్రతను పాటించడం వల్ల అన్ని జంతువులు ఆరోగ్యంగా ఉన్నాయన్నారు. జూలో అన్ని జంతువులు, పక్షులు ఒకేచోట ఉండటం వల్ల పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జూ పార్కు అధికారులు, సిబ్బంది డిప్యూటీ క్యూరేటర్ ఎ.నాగమణి, డాక్టర్ ఎంఏ హకీం, ఎ.సతీష్‌బాబు, బి.లక్ష్మణ్, ఎంఏ రహీమ్, ఎం హనీపుల్లా తదితరులు పాల్గొన్నారు.






