8 August, 2026 | 11:23 PM

తీన్మార్ మల్లన్నను భారీ మెజార్టీతో గెలిపించాలి

26-05-2024 01:56 AM

రాష్ట్ర పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అధ్యక్షుడు  కోట మల్లిఖార్జున రావు

అబ్దుల్లాపూర్‌మెట్, మే 25 : కాంగ్రెస్ పార్టీ గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను పట్టుభద్రులంతా ఓట్లు వేసి భా రీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పెరిక కు ల కార్పొరేషన్ సాధన సమితి అసోసియేష న్ అధ్యక్షులు కోట మల్లికార్జున రావు కోరా రు. శనివారం పెద్దఅంబర్‌పేటలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులంతా తీన్మార్ మల్లన్నకు ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటుపై 100 రోజుల్లో ఏర్పాటు చేసి గెజిట్ ఇచ్చారని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తాము ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా ఈ విషయంపై 0స్పందించలేదన్నారు.

అందుకే పెరిక కులానికి చెందిన గ్రాడ్యుయేట్లు తీన్మా ర్ మల్లన్నకు ఓటు చేయాలని కోరారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వకపోగా, లీకేజీల పేరుతో నిరుద్యోగుల్ని నట్టేటా ముంచిందని ఆరోపించారు. ఉద్యోగాలు రాక గ్రామాలకు వెళ్లలేక నిరు ద్యోగా లు ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. ఉద్యోగాలు లేని యువకులకు పెళ్లి ళ్లు కాక ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. మరోవైపు, కేంద్రంలోని బీజేపీ కూడా సంవత్సారానికి కోటి ఉద్యోగాలు అని చెప్పి గద్దెనెక్కి నిరుద్యోగులను ముంచిందని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలోనే ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పెరిక సంఘ ఉపాధ్యక్షులు దాచేపల్లి రవి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జోకూరి రాజు, నరసయ్య, అనిరుద్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.