17-02-2026 12:31:10 AM
ఘనంగా ఎన్టీఆర్ స్టేడియంలో మహాశివ రాత్రి మహోత్సవం..
ముషీరాబాద్, ఫిబ్రవరి16 (విజయక్రాం తి): శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు నగరంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. వేలాదిమంది భక్తులతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. పంచభూత శాంతి అభిషేకాలు జపం ధ్యానం జాగరణ అభిషేకాలు కన్నుల పండువగా సాగాయి. భక్తులందరికీ అభిషేకా లు తీర్థప్రసాదాలు ఉచితంగా రుద్రాక్ష విభూతిని శ్రీకృష్ణ చాముండేశ్వరి అందజేశారు.
పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు సిబ్బంది కార్యక్రమానికి హాజరయ్యా రు. ఈ కార్యక్రమంలో పీఠం ప్రతినిధులు తారక్ దీపక్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, రాజ్య సభ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఎంపీ బల రాం నాయక్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ,శాసనమండలి సభ్యులు దాసోజు శ్రవణ్, పెద్ద శ్రీశైలం గౌడ్, సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఐపీఎస్ అధికారి డా.జె డి లక్ష్మీనారాయణ , ప్రముఖ సామాజి క కార్యకర్త చిన్న శ్రీశైలం యాదవ్, కట్టెల శ్రీనివాస్‌యాదవ్, జనార్దన్‌రెడ్డి,
రమేష్ నాయుడు ప్రపంచ పర్యావరణ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సి.హెచ్ భద్ర, చిన్నారావు, వినోద్ కుమార్ రెడ్డి, బీఆర్ ఎస్ నాయకు లు ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజేంద్రనగర్ హరిహరక్షేత్రంలో ఆల య పూజారి అనంత చారి నేతృత్వంలో సోమవారం మహా రుద్రాభిషేకం, లింగోత్సవం,
పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ మహేశ్వరి దంపతులు బాలకృష్ణ వసుంధర దంపతులు హాజరై శివపార్వతుల కళ్యాణమహోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు.