calender_icon.png 18 February, 2026 | 1:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపాలిటీల్లో నూతన పాలన పగ్గాలు చేతబట్టి

17-02-2026 12:29:39 AM

నాగర్ కర్నూల్ ఫిబ్రవరి 16 ( విజయక్రాంతి ) /  కల్వకుర్తి / కొల్లాపూర్ టౌన్: నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ ము న్సిపాలిటీలలో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం అన్ని మున్సిపాలిటీలలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను ఆయా మున్సిపాలిటీల వేదికగా ప్రత్యేక ఎన్నికల అధికా రుల సమక్షంలో నిర్వహించింది.

ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ అభ్య ర్థులను నాయకులు ముందుగా క్యాం పుకు తరలించి, అక్కడి నుండి ప్రత్యేక బస్సుల ద్వారా నేరుగా మున్సిపల్ కా ర్యాలయానికి తీసుకువచ్చారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ పీఠం బిసి జనరల్ కు కేటాయించగా  చైర్మన్గా 23వ వార్డు నుండి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ గా 8వ వార్డు నుండి పోటీ చేసిన అభ్యర్థి బాదం రమేష్ లను మెజారిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్నికల అధికారి ఆర్డిఓ సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డిలు స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి సమక్షంలో ప్రకటించారు. కల్వకుర్తి మున్సిపాలిటీ జనరల్ మహిళ రిజర్వ్ కావడంతో చైర్మన్గా 7వ వార్డు అభ్యర్థి బృంగి రత్నమాల, వైస్ చైర్మన్ గా షాన్వాస్ ఖాన్ లను ఎన్నికల అధికారి ఆర్డీఓ జనార్దన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్, ఎంపీడీవో వెంకట రాములు ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

అనంతరం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వారిని శాలు వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో చైర్మన్ గా రెడ్డి జ్యోతి సత్యనారాయణ. వైస్ చైర్మన్ గా ఎండి రహీం భాషను అధికారులు ప్రకటించారు. అనంతరం ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సభ్యులను ఆశీర్వదిస్తూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా పాలనలో అభివృద్ధికి అడుగులు వేయాలన్నారు.