20 June, 2026 | 8:40 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

ఆస్ట్రేలియాకు షమీ!

15-11-2024 12:00 AM

న్యూఢిల్లీ: ఏడాది కాలంగా క్రికెట్‌కు దూరమైన టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ బెంగాల్ తరఫున మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 ఓవర్లు వేసిన ఈ బెంగాలీ బౌలర్ నాలుగు వికెట్లతో అదరగొట్టాడు. ప్రతిష్టాత్మక బోర్డర్ ట్రోఫీలో భారత్ తరఫున షమీ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించినా బోర్డర్ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో షమీకి చోటు దక్కలేదు.

దేశవాళీలో నిరూపించుకున్న తర్వాత మాత్రమే ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావించారు. తాజాగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన షమీ రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడన్న దానిపై అతడి ఎంపిక ఆధారపడి ఉంది. షమీని ఆస్ట్రేలియా ఫ్లుటై ఎక్కించాలని సెలెక్టర్లు భావిస్తే బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్, ప్రసిధ్, హర్షిత్ రానాలతో కూడిన పేస్ విభాగం మరింత పటిష్టం కానుంది.