calender_icon.png 19 February, 2026 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ నుంచి శంకర్ రెడ్డి సస్పెన్షన్

19-02-2026 02:23:03 AM

సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.జార్జ్

సంగారెడ్డి, ఫిబ్రవరి 18: సంగారెడ్డి పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పొన్న శంకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఎం.జార్జ్ బుధవారం మీడియాకు వివరించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా పనిచేసిన కారణంగా పొన్న శంకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ ఛైర్మన్ షఫీ హఫీజ్, పార్టీ సీనియర్ నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, కౌన్సిలర్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలే కారణం...

గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీకి పొన్న శంకర్ రెడ్డి వ్యతిరేకంగా పని చేశారని, అప్పుడే సస్పెండ్ చేసినప్పటికీ, అధిష్టానం దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరినట్లు తెలిపారు. దీంతో సస్పెన్షన్ ఎత్తి వేశారు. కానీ ఆయన అన్నకొడుకు 12వ వార్డులో బీఆర్‌ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేసిన సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా శంకర్ రెడ్డి పని చేశారన్నారు. పోతిరెడ్డిపల్లిలోని మూడు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే దిశగా పనిచేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్న శంకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నామని జార్జ్ స్పష్టం చేశారు.