పదవ తరగతి ఫలితాల్లో శాంతినికేతన్ ఘనత
29-04-2026 08:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో 100% ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్, కరస్పాండెంట్ స్ భగవతి పద్మనాభ గౌడ్ తెలిపారు. పాఠశాలకు చెందిన డి శ్రీనిధి 568, రాజేశ్వరి 564, హర్షవర్ధన్ 558, శ్రీ నిత్య556, శ్రీ రాగ్ని,554 జాహ్నవి 553, సాత్విక 552, మార్కులు సాధించినట్లు వారు వెల్లడించారు. మంది విద్యార్థులు 500 పైగా మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాలలో ఆయన అభినందించి సన్మానం చేశారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దిట్టుగా మంచి ఫలితాలను సాధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు






