15 April, 2026 | 1:38 PM

Breaking News

అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •  

షీ టీమ్ అవగాహన కార్యక్రమం

25-02-2026 05:04 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం ఖీరిడి గ్రామంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో షీ టీమ్ సభ్యులు విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పరీక్షల సమయంలో సమస్యలు ఎదురైతే వెంటనే తెలియజేయాలని సూచించారు.

సోషల్ మీడియా, ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు వివరించారు. సహాయం అవసరమైతే 8712670564 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ తుకారం, ఎస్సై బిక్కులాల్, సిబ్బంది స్వప్న, రజని, దినేష్ పాల్గొన్నారు.