23 June, 2026 | 7:29 PM

Breaking News

మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •   ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి   •   వెంకటాపురం గ్రామంలో విద్యా సామగ్రి పంపిణీ   •   చికిత్స కోసం రూ.1.50 లక్షల ఎల్ఓసి అందజేత   •   పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ చైర్మన్‌గా మిద్దెల సత్యనారాయణ   •   విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం   •  

తగ్గేదే లే!

26-11-2024 12:00 AM

85 ఏళ్ల వయసులో ఫ్యాషన్ ప్రియులకు ఐకానిక్ స్టార్‌గా మారిందీ బామ్మ.. ఒక్కసారిగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిపోయింది. అందానికి ఈ బామ్మ కొత్త ముచ్చట చెబుతుంది. మనసుకు వయసుతో సంబంధం లేదని నిరూపించింది. అరవై ఏళ్లు వచ్చాయంటే.. కృష్ణా.. రామా.. అంటూ ఏదో ఓ మూలన చేరి శేష జీవితాన్ని గడిపేస్తుంటారు వృద్ధులు. అయితే ఓ 85 ఏళ్ల బామ్మ మాత్రం నాకేమంత వయసైపోయింది? అంటూ లేడి పిల్లల మారిపోయింది.అంతేనా.. సినిమా హీరోయిన్లకు దీటుగా.. ఫ్యాషన్ ఐకాన్‌గా మారిపోతుంది. ఈ బామ్మ స్టయిల్ చూస్తే వందేళ్లు వచ్చినా ఏ మాత్రం తగ్గకూడదు.. అనిపించేస్తుంది.   

జాంబియాకు చెందిన మార్గరెట్ చోలా.. అనే 85 ఏళ్ల వృద్ధురాలు ఊహించని రీతిలో గ్లోబల్ ఫ్యాషన్ ఐకాన్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా చూస్తే.. వామ్మో అనేస్తారు. ‘లెజెండరీ గ్లామా’ హ్యాష్ ట్యాగ్‌తో ప్రతి రోజూ రకరకాల ఫ్యాషనబుల్ వస్త్రాధారణతో చమటలు పట్టించేస్తుంది. మార్గరెట్ చోలా బామ్మకు 1,05000 మంది ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఫేమస్ సన్ గ్లాసెస్ నుంచి రకరకాల ఆభరణాల వరకు లెటెస్ట్ స్టయిల్‌లో దుస్తులను ధరించి.. ఫొటోలకు ఫోజులిస్తుంది.

అయితే అలా దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడం బామ్మ దినచర్య. ఆమె సృజనాత్మక ఆలోచనను న్యూయార్క్‌లో ఉంటున్న ఆమె మనవరాలు డయానా కౌంబా ఎమ్.ఎస్ చోల ‘గ్రానీ సిరీస్’ పేరిట వెబ్ సిరీస్ తీసింది. దీంతో బామ్మ డ్రెస్ ఆప్ సెషన్‌లు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి.