23 June, 2026 | 8:11 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు

23-06-2026 07:09 PM

విత్తనమేళాలో మండల ఏవో షేక్ జావీద్

నేరేడుచర్ల,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల గ్రామ రైతు వేదిక నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చే నిర్వహించబడుతున్న "రైతు వేదికలలో విత్తనమేళా" కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి జావీద్ మాట్లాడుతు... రైతులకు పంట మార్పిడి, సన్న వడ్ల రకాల సాగుని ప్రోత్సహించడం,  వ్యవసాయ రంగంలో అధునాతన పద్ధతులు వాటి ప్రోత్సహకాలు, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న వివిధ రకాల పథకాల గురించి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది.

రైతులకు వివిధ రకాల విత్తనాలు  అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి, మాజీ చైర్మన్ బి. ప్రకాష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురేష్ రెడ్డి, డైరెక్టర్లు, గ్రామ సర్పంచి శ్రీనివాస్, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు హిమబిందు, త్రివేణి, విత్తన కంపెనీ డీలర్లు, ఫర్టిలైజర్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.