విద్యార్థులకు స్ఫూర్తి… నోటుబుక్స్ పంపిణీతో ఆనందం
23-06-2026 05:44 PM
కల్లూరు,(విజయక్రాంతి): స్థానిక మున్సిపాలిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ధాతల సహకారంతో అందించిన 600 నోటుబుక్స్‌ను పదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రతి విద్యార్థికి 7 నోటుబుక్స్ చొప్పున అందజేసి వారి విద్యాభ్యాసానికి తోడ్పాటు అందించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రత్తిపాటి నివేదిత ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్స్ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు విద్యలో ముందుకు సాగాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్ఫూర్తి ఫౌండేషన్ కమిటీ సభ్యులు ఉబ్బన బాబురావు,జల్ది రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, మర్రెల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.






