ప్రజారోగ్యాన్ని... నాశనం చేస్తున్న డంపింగ్ యార్డ్ ను వెంటనే మూయించండి
హైదరాబాద్ ఘన వ్యర్థాలను... సుదూర ప్రాంతాలకు తరలించండి
తక్షణమే హైదరాబాద్... పట్టణీకరణను రక్షించండి
పర్యావరణము... పంచభూతాలను పరిరక్షించండి
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ
బేగంపేట ప్రజా భవన్ లో వినతి పత్రం సమర్పణ
జవహర్ నగర్,(విజయక్రాంతి): పర్యావరణాన్ని ప్రజారోగ్యాన్ని నాశనం చేస్తున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను వెంటనే మూసి వేయించండి అని హైదరాబాద్ ఘన వ్యర్ధాలను సుదూర ప్రాంతాలకు తరలించాలని తక్షణమే హైదరాబాద్ పట్టణీకరణ రక్షించండి అని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ ప్రజా భవన్ లో (ప్రగతిభవన్లో) తెలంగాణ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా స్పందించిన చిన్నారెడ్డి వెంటనే మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వారి సమస్యలను సావధానంగా విన్న చిన్నారెడ్డి ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఈ సందర్భంగా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ కన్వీనర్లు షేక్షావలి, ఉమా మహేష్ లు మీడియాతో మాట్లాడుతూ, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని జవహర్ నగర్ పరిసర 12 గ్రామాల కాలనీల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ 2001వ సంవత్సరంలో జవహర్ నగర్ లో ఏర్పాటు చేశారని మొదట్లో ఆల్వాల్ ఉప్పల్ కాప్రా మున్సిపాలిటీల వ్యర్ధాలను సుమారు నాలుగేళ్ల పాటు పారబోయడానికి దాదాపు 330 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారని
అయితే దాని నిర్దేశిత కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా దానిని మూసి వేయకుండా గత రెండున్నర దశాబ్దాలుగా హైదరాబాద్ నగరం మొత్తం మున్సిపల్ ఘన వ్యర్ధాలను ఇక్కడే పారబోస్తున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నేడు ఇది 350 ఎకరాల నుండి 400 ఎకరాలకు విస్తరించిందని ప్రతిరోజు సుమారు 9600 మెట్రిక్ టన్నుల ఘన వ్యర్ధాలను స్వీకరిస్తోందని జిహెచ్ఎంసి ఒప్పందం ప్రకారం రామ్కీ ఎన్విరో అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో నడుపుతూ పర్యావరణ ఉల్లంఘనలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని దుయ్యబట్టారు. జవహర్ నగర్ చుట్టుపక్కల సేకరించిన భూగర్భ జలాల నమూనాలో అత్యంత విషపూరితమైన కాటిన్య జలాలతో నిండిందని వెళ్లడైందని తెలిపారు.
నీటిలో క్లోరైడ్ సాంద్రత ఎక్కువ ఉండడం వలన లీచిట్ కాలుష్యానికి ప్రత్యక్ష నిదర్శనమని దీనివల్ల ఏర్పడే పైహు లో మిథైన్స్ వల్ల క్యాన్సర్ వ్యాధి సంభవిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా షేక్షావలి మాట్లాడుతూ ఒక ప్రాంత ప్రజల తాగునీటి వనరులను పూర్తిగా నాశనం చేయడమే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం పౌరులకు లభించిన జీవించే హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ విషపూరితమైన ఫ్లై యాష్ (బూడిద) ప్రమాదకరమైన స్థాయిలు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ట్రిబ్యునల్ కు సమర్పించిన నివేదికలో జవహర్ నగర్ లోని వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నుండి వెలబడుతున్న ఫ్లైయాష్ లో భారీ లోహాలకు పరిణామం రక్షణ పరిమితులకు మించి ప్రమాదకరంగా ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు.
ఇకనైనా జవహర్ నగర్ ప్రజలు గత రెండున్నర దశాబ్దాలుగా డంపింగ్ యార్డ్ ను ఎత్తివేయటం కోసం వేచి చూస్తున్నారని అనేక వినతులు విజ్ఞాపనలు సమర్పించారని పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలిపారని ప్రజా ప్రతినిధులను మంత్రులను, కేంద్ర మంత్రులను ఉన్నతాధికారులను కలిసినా ప్రయోజనం నిష్ఫలమైందని పేర్కొన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పోరాట కమిటీ కృషితో కోర్టులను ఆశ్రయించిందని శాస్త్రీయ ఆధారాలు ఇప్పుడు అంతర్జాతీయంగా నిరూపితమయ్యాయని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అనేది ప్రజల తాగునీటిని విషపూరితనం చేస్తూ గాలి కలుషితం నీరు కలిసితం పర్యావరణం కలుషితం, వాతావరణం కలుషితం, సర్వం పంచభూతాలు కలుషితమయ్యాయని పిల్లలను వృద్ధులను రోగాలు పాలు చేస్తున్న ఈ డంపింగ్ భూతాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇది ఒక పర్యావరణానికి విపత్తుగా తాత్కాలిక చర్యలతో కాలయాపన చేయకుండా శాశ్వత పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రజల బాధలు నిజమైనవి కాబట్టి ఈ పరిస్థితిని తీవ్రతను గమనించి తక్షణమే నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని తెలిపారు.






