మెరిసిన అనన్య

17-04-2024 12:40:55 AM

సివిల్స్ ఫలితాల్లో ౩వ ర్యాంకుతో సత్తాచాటిన పాలమూరు బిడ్డ


హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి), న్యూఢిల్లీ: ఆలిండియా సివిల్ సర్వీసెస్ సంబంధించి యూపీఎస్సీ తుది ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఆదిత్య శ్రీవాస్తవ తొలి ర్యాంకు సాధించగా, అనిమేశ్ ప్రధాన్ రెండో ర్యాంకు సాధించాడు. ఇక పాలమూరుకు చెందిన అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఆదిత్య శ్రీవాస్తవ ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అనిమేశ్ ప్రధాన్ ఎన్‌ఐటీ రూర్కెలా నుంచి బీటెక్ చదువుకున్నాడు. మొత్తం 1,016 మందిని వివిధ సర్వీసుల కోసం యూపీఎస్సీ ఎంపిక చేసింది. వీరిలో జనరల్ కోటాలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ కోటాలో 115 మంది, ఓబీసీ నుంచి 303 మంది, ఎస్సీ కేటగిరీ నుంచి 165 మంది, ఎస్టీ విభాగం నుంచి 86 మంది ఎంపికయ్యారు. ఇక పోస్టుల వారీగా చూస్తే 180 మంది ఐఏఎస్ కోసం, 200 మంది ఐపీఎస్ కోసం, 37 మంది ఐఎఫ్‌ఎస్ కోసం ఎంపికయ్యారు. ఇక సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ కేటగిరీకి 613 మంది, గ్రూప్ సర్వీసులో 113 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ పేర్కొంది.

పాలమూరు అమ్మాయికి..

పాలమూరుకు చెందిన అనన్యరెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిసింది. గతేడాది కూడా తెలుగమ్మా యి ఉమాహారతి మూడో ర్యాంకుతో సత్తా చాటగా, అనన్యరెడ్డి మూడో ర్యాంకు సాధించడం విశేషం. అనన్యది పాలమూ రు జిల్లా అడ్డకల్ మండలం పొన్నకల్ గ్రామం. ఢిల్లీ యూనివర్సిటీ అనుబంధ కాలేజీ మీరాండ హౌస్‌లో జియోగ్రఫీలో డిగ్రీ పూర్తి చేసింది.

మూడు దశల్లో పరీక్ష..

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 1,105 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ గతేడాది నోటిఫికేషన్ ఇచ్చింది. గతేడాది మే 28న ప్రిలిమ్స్ పరీక్ష జరగగా, ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 15, 16, 17, 23, 24 తేదీల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. డిసెంబర్ 8న మెయిన్స్ పరీక్ష ఫలితాలు విడుదల చేశారు. మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారికి ఈఏడాది జనవరి 2 నుంచి ఏప్రిల్ 9 మధ్య పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ.. తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది.

ఇంతటితో ఆగిపోలేదు : ప్రధాని

సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫలితాల్లో విజ యం సాధించలేకపోయిన వారు నిరాశ చెం దాల్సిన అవసరం లేదని  మరింత కష్టపడి భవిష్యత్తులో విజయం సాధించాలని ధైర్యం చెప్పారు.

సీఎం రేవంత్ అభినందనలు

సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంకు లు సాధించిన తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభి నందనలు తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రా ల నుంచి ఈసారి 50 మందికి పైగా సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.