24 June, 2026 | 2:10 PM

Breaking News

తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •  

గట్లమల్యాలలో వైభవంగా శివాజీ జయంతి వేడుకలు

20-02-2026 12:00 AM

నంగునూరు,ఫిబ్రవరి 1౯: మండల పరిధిలోని గట్లమల్యాల గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను ఆరెక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాల వేసి, బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆరెక్షత్రియ సంఘం మండల అధ్యక్షుడు,గ్రామ సర్పంచ్ ఇంగే నరేష్ మా ట్లాడుతూ.. మొఘల్ సామ్రాజ్యవాదులను ఎదిరించి, భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన వీరుడు శివాజీ అని కొనియాడారు.

క్షత్రియ ధర్మాన్ని పాటిస్తూనే రైతు సంక్షేమం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిప్పని శ్రీనివాస్, వార్డు సభ్యులు సత్తయ్య, ఎర్ర బాబు గ్రామస్తులు రవీంద్ర చారి,కృష్ణమూర్తి, తిరుపతి, జయరాములు, నర్సింగరావు, రంకు అశోక్, రమేష్, రామారావు, బిక్షపతి, రాజేశం, రమేష్, రాజులు, చింతం రాజు, యాదగిరి, కనకరాజు, శివ, ఆరెక్షత్రియ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.