calender_icon.png 20 February, 2026 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తక్షణమే జీతాలు చెల్లించండి

20-02-2026 12:00:00 AM

ఎన్‌ఎఫ్‌సీలో విధుల బహిష్కరించిన కాంట్రాక్ట్ కార్మికులు

కుషాయిగూడ, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఎఫ్‌సి లో గత మూడు నెలలుగా 300 మంది కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో విధులు బహిష్కరించి ఎన్‌ఎఫ్‌సి నార్త్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు పిల్లల ఫీజులు ఇంటి కిరాయిలు రేషన్ సరుకులు చెల్లించలేకపోతున్నామని ఎన్ ఎఫ్ సి లో ఎన్నో ఏండ్లుగా నమ్ముకొని కాంట్రాక్టు కార్మికులుగా జీవితాలను కొనసాగిస్తున్నామని పలువురు కాంట్రాక్టర్లు జీతాలు చెల్లించకపోవడంతో తమ బతుకులు రోడ్ల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్‌ఎఫ్‌స యజమాన్యం కాంట్రాక్టు లకు జీతాలు చెల్లించినప్పటికీ ఆయా కాం ట్రాక్టర్లు, కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు చెల్లించక కాలయాపన చేస్తున్నారని కాంట్రా క్ట్ కార్మికులు మండిపడుతున్నారు.

ఇప్పటికీ పలుసార్లు విజ్ఞప్తి పత్రంల ద్వారా మెమో రాండం సమర్పించిన ప్రయోజనం లేకుం డా పోయిందని కాంట్రాక్టు కార్మికుల వేతనాలు చెల్లించి న్యాయం చేయాలని మొర పెట్టుకుంటున్నారు పలువురు కాంట్రాక్టర్లను వివరణ కోరగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు ఆందోళన విషయాన్ని తెలుసుకున్న ఎన్ ఎఫ్ సి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులతో చర్చలు జరిపారు. 3 నెలల జీతాలు అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన చేస్తున్న కార్మికులు ఆందోళన విరమించారు.