హిందూ సంఘటిత శక్తి శివాజీ మహారాజ్
మిర్యాలగూడ, ఏప్రిల్ 2 : హిందూ సంఘటిత శక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కార్యవాహ నాగరాజు, విభాగ్ బౌద్దిక్ ప్రముఖ్ జనార్దన్ లు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఎస్ పీ ఆర్ పాఠశాలలో హిందూవాహిణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. సంఘటిత శక్తితోనే హిందూ సమాజం చైతన్యం అవుతుందని, శివాజీ స్ఫూర్తితో యువత ధర్మ పరిరక్షణకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు.
శివాజీ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటేలా విగ్రహ నిర్మాణం చేపట్టాలని కోరారు. అనంతరం శివాజీ మహారాజ్ విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులుగా ఘంటా సంతోష్ రెడ్డి, కార్యదర్శులుగా పెద్దిబోయిన రామకృష్ణ, చెరుపల్లి కరుణాకర్ కోశాధికారిగా చీదల్ల సత్యనారాయణ లను ప్రకటించి కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వీ హెచ్ పీ ఎస్ జిల్లా అధ్యక్షులు గార్లపాటి ఉమాకర్ రెడ్డి, రేపాల పురుషోత్తం రెడ్డి, గూడూరు శ్రీనివాస్, కర్నాటి రమేష్, సోమలింగం, సుధాకర్, గిరి, వెంకటేశ్వర్లు, మారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




