4 April, 2026 | 2:10 AM

కార్యకర్తలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

04-04-2026 12:18 AM
  1. బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది
  2. కాంగ్రెస్ వడ్డీలు కడుతూనే ప్రజలకు సంక్షేమ ఫలాలందిస్తుంది
  3. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ 

మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తల శ్రమ, కృషే ప్రధాన కారణమని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శుక్ర వారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్ లో నిర్వహించిన జిల్లా స్థాయి కాంగ్రెస్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై జిల్లా ఇంఛార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు, కార్మిక, మైనింగ్ ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావులతో కలిసి ఆయన మాట్లాడారు.

బీఆర్‌ఎస్ నిర్బంధ పాలనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని, అక్రమ కేసు లు అనుభవించారని, అయినా మొక్కవోని దైర్యంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడ్డారన్నారు. 65 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో చేయలేని అప్పు లు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లలో చేసిందని, 8 లక్షల కోట్ల అప్పులకు కాంగ్రెస్ ప్రభు త్వం నెలకు ఆరు వేల కోట్లు వడ్డీలు కడుతూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అంద్తి న్నామన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణ రావు మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభు త్వం అమలు చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని, ఇప్పటికే దాదాపు ఐదు పూర్తి చేశామన్నారు. కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ అన్ని పార్టీల్లో గ్రూప్ రాజకీయాలు ఉంటాయని, వాటిని పక్కన పెట్టీ పార్టీ కోసం పని చేయాలన్నారు.

బీఆర్‌ఎస్ పదేండ్లలో చేసిన అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపాలని, ప్రభుత్వంపై ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పథకాల్లో భారీ స్కాం జరిగిందని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి అప్పుల రాష్ట్రంగా మార్చిందని దుయ్యబట్టారు.

అనంతరం మంచిర్యాల జిల్లా అధ్య క్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి తోపాటు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్, హుస్సేన్, సత్యనారాయణ, నీలకంఠేశ్వర్ గౌడ్, తూముల నరేష్ తదితరులు పాల్గొన్నారు.