calender_icon.png 13 June, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా వేట శివాజీ ముదిరాజ్

11-06-2025 03:43:13 PM

నియామక పత్రం అందజేస్తున్న ఆర్ కృష్ణయ్య

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రానికి చెందిన వేట శివాజీ ముదిరాజ్ ను బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ బుధవారం హైదరాబాదులోని బీసీ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వేట శివాజీ మాట్లాడుతూ యువతరాన్ని ఉద్యమంలోకి తీసుకొని ఉద్యమ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. నా నియామకానికి సహకరించిన బీసీ విద్యార్థి సంఘం జాతీయ కోఆర్డినేటర్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ కు బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ కు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చయ్య సురేష్ గౌడ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.