calender_icon.png 4 December, 2024 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దాతృత్వంలో శివనాడార్ టాప్

08-11-2024 01:18:03 AM

హురున్ జాబితా

న్యూఢిల్లీ, నవంబర్ 7: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివనాడార్ దాతృ త్వంలో మరోసారి దేశంలోకెల్లా టాప్‌లో నిలిచారు. ముగిసిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు దాతృత్వ కార్యకలాపాలుకు విరాళంగా ఇచ్చారు. శివనాడర్ ఫౌండేషన్ అధికంగా విద్యా సంబంధిత కార్యక్రమాలకు ఖర్చుచేస్తుంది.

గురువారం విడుదలైన హురున్ ఇండియా దాతృత్వ జాబితా ప్రకారం శివనాడార్ అంతక్రితం ఏడాది ఇచ్చిదానికంటే విరాళాల్ని 5 శాతం పెంచారు. 2022-23 లో సైతం ఆయనే అగ్రశ్రేణి దాతగా నిలిచారు. దేశంలో నంబర్‌వన్ శ్రీమంతుడైన గౌతమ్ అదానీ (రూ.330 కోట్లు),  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధి నేత, దేశంలో రెండవ శ్రీమంతుడైన ముకేశ్ అంబానీ (రూ. 407 కోట్లు) కంటే ఎన్నో రెట్లు అధికంగా శివనాడార్ దాతృత్వ కార్యకలాపాలకు వెచ్చించడం గమనార్హం.

దేశీయ కుబేరుల్లో రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో నాడార్ మూడో స్థానంలో ఉండగా, తొలి రెండు స్థానాల్లో గౌతమ్ అదానీ (రూ.11.6 లక్షల కోట్లు), ముకేశ్ అంబానీ (రూ.10.14 లక్షల కోట్లు) ఉన్నారు. దాతృత్వ కార్యకలాపాలకు బజాజ్ కుటుం బం రూ. 352 కోట్లు, కుమార మంగళం బిర్లా రూ. 334 కోట్ల మేర విరాళాలు ఇచ్చారు.

మహిళల్లో రోహిణి నీలకేని అధికంగా రూ. 154 కోట్లు విరాళాలు అందించారు. ఆమె భర్త నందన్ నీలకేని సామాజిక సేవ కోసం రూ. 307 కోట్లు వ్యయపర్చారు. విరాళాలు అధికంగా విద్యకు అందగా, తదుపరి హెల్త్‌కేర్, గ్రామీణ సంక్షేమానికి వచ్చాయి.