calender_icon.png 16 December, 2025 | 12:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి

15-12-2025 01:04:08 AM

  1. ఏడుసార్లు ఎంపీ, కుర్మీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు
  2. ఓబీసీ ఓటర్లను ఆకర్షించే వ్యూహం

లక్నో, డిసెంబర్ 14: కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి, ఏడుసార్లు ఎంపీ అయిన పంకజ్ చౌదరిని బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ఆదివారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ పీయూష్ గోయల్ ఈ అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చౌదరి భూపేంద్ర లాంఛనంగా పార్టీ జెండాను పంకజ్ చౌదరికి అందజేశారు.

ఈ వేడుక స్వస్తి వాచన్, శంఖ్నాద్, ఢమరు వంటి సంప్రదాయ ఆచారాలతో జరిగింది. మహారాజ్‌గంజ్ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచిన పంకజ్ చౌదరి, కుర్మీ సామాజికవర్గంలో ప్రముఖ నాయకుడు. ఉత్తరప్రదేశ్‌లోని ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ఓటర్లకు చేరువయ్యే ముఖ్య వ్యక్తిగా ఆయనను బీజేపీ భావిస్తోంది. ఈ కార్యక్రమంలో యూపీ నుంచి జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నిక కూడా పూర్తయింది. రాజ్‌నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ వంటి సీనియర్ నాయకులతో సహా  120 మంది సభ్యులు ఎన్నికయ్యారు.