6 July, 2026 | 1:55 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

బార్‌లో కాల్పులు

07-01-2025 12:21 AM

మెక్సికో సిటీ, జనవరి 6: మెక్సికోలోని ఓ బార్‌లోకి గుర్తుతెలియని వ్యక్తు లు తుపాకులతో ప్రవేశించి కా ల్పులు జరిపారు. కాల్పుల్లో ఐదుగురు పౌరులు అక్కడికక్కడే మృతిచెం దగా, మరో ఏడుగురు తీవ్రగాయాల పాలయ్యారు. టబాస్కో రాష్ట్రం విల్లాహెర్మోసాలోని ‘బార్ లా కాసిటా అజుల్’ బార్‌లోకి శనివారం రాత్రి కొందరు దుండగులు సాయుధంగా ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పు లు జరిపారు.

కాల్పుల్లో ఐదుగురు పౌరులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి వైద్యం చేయిస్తున్నారు. విల్లాహర్మోసా నగరంలో నవంబర్‌లోనూ ఇదే తరహా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో పది మంది పౌరులు మృతిచెందారు. ఆ ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంపై నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. భద్రత దళాలు నిందితులను అదుపులోకి తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించాయి.