17 June, 2026 | 2:39 AM

అభివృద్ధిలో ‘మానుకోట’ను ముందంజలో ఉంచాలి

17-06-2026 01:46 AM

మహబూబాబాద్, జూన్ 16 (విజయ క్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాలను అమలు చేసి మహబూబాబాద్ జిల్లాను ముందంజలో ఉంచే విధంగా అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచం ద్రు నాయక్ అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అభివృద్ధి, వానాకాలం సీజన్, సంక్షేమ పథకాల అమలు, జిల్లా ప్రధాన ఆ సుపత్రి అభివృద్ధి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరిష్ అధ్యక్షతన  సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ డోర్నక ల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునా యక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కనకయ్య హాజరయ్యారు. వానకాల వ్యవసా య సన్నాహక, ప్రభుత్వ పథకాల అమలు తీరుపై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వానాకాలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల స్టాక్, సరఫరా, నకిలీ విత్తనాలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.