కేసీఆర్‌పై కాంగ్రెస్ కేసుల డ్రామా!
- ప్రజల దృష్టిని మళ్లించేందుకు నాటకం
- బుల్డోజర్లతో పేదల ఇండ్లు కూల్చుతున్న రేవంత్ ప్రభుత్వం
- మేము పెద్దల ఇళ్లను కూల్చితే శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే సర్కారుదే బాధ్యత
- బాన్సువాడ బాధితులకు అండగా ఉంటా
- కేంద్ర మంత్రి బండి సంజయ్
కామారెడ్డి, మార్చి 2 (విజయక్రాంతి): ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై కేసుల డ్రామా ఆడితోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ ఆరోపించారు. సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర ముఖ్య ప్రబంధ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాల యంలో బాన్సువాడ బాధితుల కుటుంబాలను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే హోంశాఖ, విద్యా శాఖలు ఉన్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బుల్డోజర్లు తెచ్చి అమాయకులైన పేద ప్రజలందరు కూ ల్చుతున్నారన్నారని, బఫర్ జోన్, ఎఫ్ టీఎల్ పేరుతో ఇకపై పేదల ఇండ్లు కూలిస్తే అదే ప్రాం తంలో పెద్దల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చి వేస్తాం అని హెచ్చరించారు.
శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమైతే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఒవైసీ అక్రమంగా నిర్మించిన ఫాతిమా కాలేజీ కూల్చడానికి పరీక్షలు అడ్డు వస్తే ఖమ్మంలో ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల భవిష్యత్తు గుర్తుకురాలేదా? ప్రశ్నించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న శాఖల పై పట్టు కోల్పోయారని విమర్శించారు.
మజ్లిస్ పార్టీ మెప్పు పొందడానికి, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచామనే అహంకారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒవైసీకి తొత్తుగా మారారు అన్నారు. హైదరాబాద్ లో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సర్వేలు తేల్చడంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను వాయిదా వేశారన్నారు.
బాన్సువాడలో జరిగిందేమిటి? ఎవరు ఎవరి ప్లేస్ లోకి వచ్చి దాడులు చేశారనే విషయంపై వాస్తవ సమాచారం తెలుసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటానికి హిందువులపై అనేక అక్రమ కేసులు బనాయించి కాం గ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేయించి జైల్లో వేయడం దుర్మార్గ మైన చర్య అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా పేదలందరికీ 4 కోట్లు ఇండ్లు కట్టి పోటీపడుతుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడంలో పోటీ పడుతోందన్నారు.
మూసీ పరిధిలో రూ.5 వేల కోట్లతో గాంధీ విగ్రహం పెడతామని చెపుతూ పేదల ఇండ్లను కూలుస్తుంటే మహాత్మాగాంధీ ఆత్మ ఘోషిస్తోం దన్నారు. 6 గ్యారంటీలపై బీజేపీ నిలదీస్తుంటే కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడులు చేస్తూ భయభ్రంతులకు గురి చేయాలనుకుంటోందన్నారు. కాంగ్రెస్ అరాచకాలను ఎదుర్కొ ని ఎందాకైనా పోరాడేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
రాహుల్ రాష్ట్రానికి వచ్చేది మూటల కోసమే
మూసీ పరిధిలో గాంధీ విగ్రహం పేరుతో పేదల ఇండ్లను కూల్చడం దుర్మార్గం అని అన్నారు. అమెరికాతో ట్రేడ్‌డీల్ వల్ల ఏ దేశం తో యుద్ధం వస్తుందో రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చింది మూటలు తీసుకెళ్లడానికేనా? అనే అనుమానం వ్యక్తంచేశారు. రాహు ల్ గాంధీకి నిజంగా పేద ప్రజలపై ప్రేమ ఉంటే, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న ప్రాంతాలకు వెళ్లాలని కోరారు.
ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతో 800 మందికి పైగా పేదల ఇండ్లను కూల్చివేసిన ప్రాంతానికి వెళ్లాలని కోరారు. బాన్సువాడలో అక్రమంగా అరెస్ట్ చేయబడి జైలులో ఉన్న బాధిత కుటుంబాలను పరామర్శించాలని కోరారు. సమావే శంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చా ర్జ్ ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి, నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి, కామారెడ్డి జిల్లా అధ్యక్షు డు నీలం చిన్న రాజు పాల్గొన్నారు.




