calender_icon.png 25 September, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెన్ నుంచి రెసిడెన్షియల్ జోన్‌కు మార్చాలి

25-09-2025 12:33:37 AM

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి బృందావన్ కాలనీవాసుల వినతి 

ఎల్బీనగర్, సెప్టెంబర్ 24 : ఓపెన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్ కు మార్చి తమకు మౌలిక, కనీస వసతులు కల్పించాలని బృందావన్ కాలనీవాసులు డిమాండ్ చేశారు. కొత్తపేట డివిజన్ పరిధిలోని బృందావన్ కాలనీలో బుధవారం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు పలు సమస్యలను  పరిష్కరించాలని కోరారు.

బృందావన్ కాలనీలో అంతర్గత రోడ్లు, నూతన డ్రైన్స్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.  కరెంట్ సమస్య పరిష్కరించడానికి అదనపు స్తంభాలు ఏర్పాటు చేయాలన్నారు. బృందావన్ కాలనీ ఓపెన్ జోన్లో ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రెసిడెన్షియల్ జోన్ లోకి మార్చాలని కోరారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... ఓపెన్ జోన్ విషయంలో గతంలో సంబంధిత మంత్రితో మాట్లాడానని గుర్తు చేశారు.

ఎవరూ ఎలాంటి ఆందోళనకు గురికావొద్దన్నారు.  నూతన డ్రైన్స్, కరెంట్ స్తంభాల ఏర్పాటుపై అధికారులతో మాట్లాడి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తామని హామీ  ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కొత్తపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రాహుల్ గౌడ్, నాయకులు ఇటికల యాదగిరి, యాసిన్, జోగు నగేశ్, అనిల్, బాలాజీ, కరుణాకర్, శ్రీనివాస్, కాలనీవాసులు శ్రీనివాస్ యాదవ్, రాకేశ్, సతీశ్, శేఖర్, దీపక్, రాజేశ్, సాయి, అరుణ్, శివ, రసూల్, వెంకటేష్ గుప్తా, నాగేశ్వరరావు, రమేశ్, రాజు, శ్రీనివాస్, యాదయ్య, ఉదయ్, హుస్సేన్, మరియమ్మ, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.