25-09-2025 12:33:21 AM
- రూ. 28 లక్షల తో పలు అభివృద్ధి పనులు
- బీఆర్‌ఎస్ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా పేదలను వంచించింది
- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు
పెద్దపల్లి, సెప్టెంబర్, 24 (విజయక్రాంతి) పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామణారావు అన్నారు. బుధ వారం ఆయనపెద్దపల్లి మండలంలోని అం దుగులపల్లి, దేవునిపల్లి గ్రామాల్లో రూ. 28 లక్షల నిధులతో పలు డ్రైనేజిలు, సిసి రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు ,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇం డ్ల మంజూరి పత్రాలను స్థానిక నాయకుల తో కలిసి అందజేసి, వాటి నిర్మాణాలకు ఎమ్మెల్యే ముగ్గులు పోశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అందుగులపల్లి రాజీవ్ రహదారి నుండి దేవునిపల్లి గ్రామాలను అనుసంధానం చేస్తూ రూ. 5 కోట్లు మంజూరు చేసి బి.టి రోడ్డు నిర్మించడం జ రుగుతుందని, రెండు లక్షల రూపాయల రుణమాఫీ, తిరిగి రుణ సదుపాయం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంటు, ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం, రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం పంపిణీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సదుపాయానికి రూ. 10 లక్షలకు పెంపు, కటింగులు లేకుండా వడ్ల కొ నుగోల్లు, సన్న వడ్లకు రూ. 500ల చొప్పున బోనస్, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కా ర్డులు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి ఎమ్మెల్యే విజయరమణ రావు అందజేస్తున్నట్టు చెప్పారు.
సంవత్సరంన్నర కాలంలోనే ఇన్ని సంక్షేమ పథకా లను చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అలాగే గ్రామాల్లో అనేక అభివృద్ధి పథకాలను, రోడ్లు, డ్రైనేజీలు రవాణా వంటి మౌలిక సదుపాయాలను చేపట్టడం జరుగుతుందన్నారు. తాను కూడా 24 గంటల్లో 18 గంటలు ప్రజల కోసం నిర్విరామంగా పనిచేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. రాబోయే స్థానిక సం స్థల ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర జాప్రతినిధులను ఎన్నుకుంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత ముందుకు తీ సుకువెళ్లే వీలుంటుందని, కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే భఅభ్యర్థులను స్థానిక సంస్థల ఎన్నిక ల్లో గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నా యకులు,అరె సంతోష్, సంధవేణి రాజేందర్, చింతపండు సంపత్, బొక్కలా సం తోష్, కార్యకర్తలు, అభిమానులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళలు, పలు గ్రామాల ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.