25-09-2025 12:34:55 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): మహిళల సమగ్రాభివృద్ధి, సాధికారతే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్ ప్రజల 15 ఏళ్ల కల అయిన మహిళా భవన్‌ను బుధవారం జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌లతో కలిసి వారు ప్రారంభించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు.
రూ.93.50 లక్షల వ్యయం తో జీహెచ్‌ఎంసీ నిర్మించిన ఈ నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం, అదే ప్రాంగణంలో రూ.29.80 లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవన నిర్మాణానికి మం త్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. చాలా కాలంగా మాటలకే పరిమితమై ఆచరణ కానీ పనులు ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అమలవుతున్నాయి. దానికి నిదర్శన మే ఈ మహిళా భవనం ప్రారంభోత్సవం అన్నారు.
నూతన రేషన్ కార్డులు పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పేదల పంపిణీ ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘా లకు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలు చేపట్టిందన్నారు. మహిళలు అన్ని రంగాలలో ఎదిగేందుకు ప్రభుత్వం వెన్నుద న్నుగా నిలుస్తుందన్నారు.
అనంతరం హైదరాబాద్ నగర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్బీటీ నగర్‌లో మహిళా భవన్ నిర్మించాలన్న ఈ ప్రాంత ప్రజల 15 ఏండ్ల కలను ప్రభుత్వం, జీహెచ్ ఎంసీ నెరవేర్చిందన్నారు. ఈ క్రమంలో ఎదురైన కోర్టు కేసులు పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పని చేశామన్నారు. మహిళలకు వివిధ కార్యక్రమాల నిర్వహణకు వేదికగా మహిళా భవన్ ఉపయోగపడనుందన్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తదితరులు పాల్గొన్నారు.