21 August, 2026 | 10:27 PM

Breaking News

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు   •   ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్‌కు ఆర్థిక సాయం   •   ఘనంగా ప్రారంభమైన ఓయాసిస్ కాన్- 2026   •   కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నిమ్మనగోటి శ్రీకాంత్   •   తీవ్ర రూపం దాల్చిన ఆదివాసీల నిరసన దీక్ష   •   పిల్లల ప్రవర్తనను.. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి   •   మద్యం తాగి వాహ‌నం న‌డిపిన వ్య‌క్తి రిమాండ్   •   కొత్తగూడెంల జీజీహెచ్ త్వరలో క్యాథ్ ల్యాబ్ సేవలు: ఎమ్మెల్యే కూనంనేని   •   కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు పాటుపడడం అభినందనీయం   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •  

విధుల్లో నిర్లక్ష్యం.. అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు

08-05-2026 12:36 AM

మహబూబాబాద్, మే 7 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మిక తనిఖీలో విధుల పట్ల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారనే వార్తల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ సంబంధిత ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో విధులు సక్రమంగా నిర్వహించని స్థానిక వైద్యులు, సంబంధిత సిబ్బందికి ఈ రోజు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయిలో ఉన్నా సహించబోమని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. ఆసుపత్రులలో సమయపాలన, రోగులకు మర్యాదపూర్వక సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత వంటి అంశాలలో ఎటువంటి అలసత్వం ఉండరాదని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని హెచ్చరించారు. విధి నిర్వహణలో అలక్ష్యం చేసిన సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.