calender_icon.png 11 May, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులోకి శ్రేయస్, ఇషాన్

21-04-2025 10:56:17 PM

నాలుగు కేటగిరీల్లో 34 మంది క్రికెటర్ల ఎంపిక

తెలుగు క్రికెటర్ నితీశ్‌కుమార్ రెడ్డికి చోటు

కాంట్రాక్టు కోల్పోయిన శార్దూల్, జితేశ్ శర్మ

ముంబై: 2025 ఏడాదికి గానూ భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. గతేడాది సెంట్రల్ కాంట్రాక్టులో చోటు కోల్పోయిన క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ తిరిగి చోటు దక్కించుకోగా.. తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారి సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకోవడం విశేషం. మొత్తం 34 మంది క్రికెటర్లను నాలుగు కేటగిరీల్లో ఎంపిక చేసిన బీసీసీఐ గ్రేడ్ ప్లస్ జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు చోటు కల్పించింది. ఈ నలుగురికి ఏడాదికి రూ. 7 కోట్ల చొప్పున వేతనం అందనుంది. గ్రేడ్ ఆరుగురు ఆటగాళ్లకు చోటు దక్కగా.. వీరిలో హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీళ్లకు రూ. 5 కోట్ల చొప్పున జీతభత్యాలు అందనున్నాయి. గ్రేడ్ సూర్యకుమార్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జైస్వాల్‌కు చోటు దక్కింది. వీరికి రూ. 3 కోట్ల మేర జీతాలు అందనున్నాయి. యువ క్రికెటర్లు నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, ధ్రువ్ జురేల్, అభిషేక్, సర్ఫరాజ్ ఖాన్ సహా తదితర క్రికెటర్లంతా గ్రేడ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరు రూ.కోటి చొప్పున పారితోషికం అందుకోనున్నారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న అశ్విన్ సహా శార్దూల్ ఠాకూర్, జితేశ్ శర్మ, కేఎస్ భరత్, ఆవేశ్ ఖాన్ సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయారు.

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పూర్తి జాబితా:

గ్రేడ్  ప్లస్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా

గ్రేడ్ మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్

గ్రేడ్ సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్

గ్రేడ్ రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయి, సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిధ్ క్రిష్ణ, రజత్ పటీదార్, ధ్రువ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రానా

సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఆటగాళ్లు: ఆర్ అశ్విన్ (రిటైర్డ్), శార్దూల్ ఠాకూర్, జితేశ్ శర్మ, కేఎస్ భరత్, ఆవేశ్ ఖాన్