వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

15-09-2026 | 08:10pm

మీ భద్రతే మా లక్ష్యం: ఎస్ఐ మోతిరామ్

భద్రత నియమాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత మహిళలదే 

రుద్రంగి,(విజయక్రాంతి): ఇంటి యజమనితో పాటు ఇంట్లోని పిల్లలు అన్న తమ్ముడు అక్క చెల్లి రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత మహిళలదే అని రుద్రంగి మండల ఎస్ఐ మోతిరామ్(Rudrangi Mandal SI Mothiram) అన్నారు.ఈ సందర్భంగా మహిళలకు రోడ్డు భద్రత నియమాల గురించి వివరించారు. హెల్మెట్ ధరించి బైక్ నడపాలని మీ ఇంటి యజమానికి మీ ఇంట్లోని పిల్లలకు అవగాహన కలిపించాలని కోరారు. అలాగే మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుడాదని సూచించారు.

వాహనాలకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని అన్నారు.ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని  సూచించారు.ప్రమాదాలు సంభవించినప్పుడు హెల్మెట్ లేకపోతే  ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని  దాని వలన కుటుంబాలు రోడ్డున పడతాయని మహిళలకు వివరించారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ పరిమిత వేగంతో వాహనాలు నడపాలని సూచించారు. వాహనదారుల భద్రతే మా లక్ష్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో మహిళలు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు